ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి భేటీ అయ్యారు. ఇటీవల కోవిడ్ బారిన పడి కోలుకున్న గవర్నర్ ను ఆయన ఆప్యాయంగా పలుకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఐదు రోజులపాటు నిర్వహించనున్న విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల్లో భాగస్వామ్యం కావాలని గవర్నర్ ను కోరారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ఆశీస్సులు, రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం ఎల్లపుడూ ఉంటుందని గవర్నర్ కు విన్నవించారు.
సీఎంపై టీడీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు: వైసీపీ