దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, అయుష్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) (యుజి మే) -2020 వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. నీట్-2020 పరీక్ష మే 3న జరగాల్సి ఉంది. కరోనా వైరస్ తో దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పరీక్షను మే చివరి వారంలో నిర్వహించడానికి ప్రతిపాదనలు తయారుచేస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది.
కరోనా తీవ్రతను బట్టి పరీక్ష నిర్వహణపై అంతిమ నిర్ణయం ఆధారపడి ఎన్‌టీఏ ఉంటుందిని తెలిపింది. పరిస్థితులను అంచనా వేసి ఏప్రిల్ 15 తర్వాత అడ్మిట్‌కార్డులను విడుదల చేస్తామని ఎన్‌టీఏ వెల్లడించింది. అకడమిక్ షెడ్యూల్ ఎంత ముఖ్యమో ప్రజలు, విద్యార్థుల శ్రేయస్సు కూడా ముఖ్యమేనని ఎన్‌టీఏ ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో పొందుపరస్తామనిపేర్కొంది. నీట్-2020 సమాచారం కోసం https://ntaneet.nic.in వెబ్ సైట్ లో చూడాలని ఎన్‌టీఏ తెలిపింది.
మన రాజ్యాంగం సక్రమంగా అమలు కాలేదు : ఈటల