telugu navyamedia
సినిమా వార్తలు

బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోలో పుష్పరాజ్‌..

ఆహా ఓటిటిలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న’అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే’ షోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు ఈ షోకి మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం , అఖండ టీం, రాజమౌళి హాజరయ్యారు. ఆరవ ఎపిసోడ్ కి అల్లు అర్జున్ అథిగా సంద‌డి చేయ‌నున్నారు. ఈ కార్యక్రమం డిసెంబర్​ 25న ప్రసారంకానుంది.

Allu Arjun Speech at Akhanda Pre Release event అఖండ తెలుగు సినిమాకు  వెలుగునివ్వాలి: బన్నీ

ఈ క్రమంలోనే ఇటీవలే రవితేజ , డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపిన అన్​స్టాపబుల్​ బృందం.. మంగళవారం బన్నీ హాజరైనట్లు అధికారికంగా ప్రకటించింది.

ఇటీవల బాలయ్య  అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బన్నీ అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే.ఇప్పుడు బాలయ్య షోకి బన్నీ గెస్ట్ గా హాజరు కాబోతున్నాడు. దీంతో మ‌రొక‌సారి వీరిద్ద‌రూ ఒకే వేదిక‌పై క‌నిపించ‌డంతో అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Allu Arjun Is The Balakrishna Aha Ott Unstoppable Talk Show - Telugu  Unstoppble-Telugu Trending Latest News Updates-TeluguStop

ఈ షోలో బాలయ్య బన్నీకి ఎలాంటి ప్రశ్నలు వేస్తారు…. బన్నీ ఏం మాట్లాడతాడు అనే ఉత్కంఠ నెలకొంది. క్రిస్టమస్ కానుకగా ఈ ఎపిసోడ్ ని ఆహా సంస్థ స్పెషల్ గా ప్లాన్ చేస్తోంది అట. బన్నీతో పాటు పుష్ప టీం కూడా అన్ స్టాపబుల్ షోకి హాజరు కానున్నారు.

సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం నేప‌థ్యంలో తెర‌కెక్కిన పుష్ప చిత్రం డిసెంబర్ 17న విడుద‌లైంది. ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తున్నాడు అల్లు అర్జున్. బన్నీ ఊరమాస్ గెటప్ అభిమానులతో ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో శ్రీవ‌ల్లిగా ర‌ష్మిక న‌టించింది.

Related posts