telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ ఆత్మహత్య కేసు… స్పందించిన మహారాష్ట్ర సీఎం కుమారుడు

SSR

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు బాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపుతోంది. జూన్ 14న సుశాంత్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. పలువురు బాలీవుడ్ ప్రముఖుల్ని ఇప్పటికే విచారించారు. ఈ కేసులో బీహార్, మహారాష్ట్ర పోలీసులు ఇద్దరూ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, అది ఖచ్చితంగా హత్యేనంటూ ఇటీవల ఓ డాక్టర్ విడుదల చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఇక ఈ కేసులో పలువురిపై ఆరోపణలు విన్పిస్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి మహారాష్ట్ర సీఎం కుమారుడు, మంత్రి ఆదిత్య థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ ‌రాజ్‌పుత్ కేసులో నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సినీ పరిశ్రమలో ఉన్నవారితో తనకు పరిచయాలున్నాయని, అదేం నేరం కాదని ఆదిత్య చెప్పుకొచ్చారు. తాను హిందూ హృదయసామ్రాట్ బాలాసాహెబ్ థాక్రే మనవడినని, మహారాష్ట్ర గౌరవానికి, శివసేన, థాక్రే కుటుంబానికి మచ్చ తెచ్చే ఏ పని తాను చేయనని ఆదిత్య థాక్రే వ్యాఖ్యానించారు. సుశాంత్ చనిపోవడానికి, తనకూ ఎటువంటి సంబంధం లేదని, శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

Related posts