ఏపీ సీఎం చంద్రబాబుపై కేసు వేస్తానని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపనంద సరస్వతి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని ఘాటుగా స్పందించారు. ఒక పీఠాధిపతిగా ఉంటూ రాజకీయాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. స్వరూపానందస్వామి కేసు వేస్తానని అనడం విడ్డూరంగా ఉందన్నారు.
రాజకీయాలు చెయ్యాలంటే పీఠాధిపతి పదవి వదిలేసి వైసీపీలో చేరాలంటూ హితవు పలికారు. ఒక పీఠాధిపతిగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడటం సరికాదన్నారు. స్వామీజీ రాజకీయాలు మాట్లాడాల్సిన అసవరం ఏంటని నిలదీశారు. ప్రవచనాలు చెప్పాల్సిన స్వామి రాజకీయాలు బోధించడం మానుకోవాలని లేకపోతే వైసీపీలోకి చేరిపోవాలని సాధినేని యామిని స్పష్టం చేశారు.
మండలిలో మంత్రి అనిల్ వ్యాఖ్యల పై టీడీపీ నిరసన