విహారయాత్రకు వెళ్తుండగా శ్రీ చైతన్య పాఠశాల బస్సు ప్రకాశం జిల్లాలో బోల్తా కొట్టింది. నరసరావుపేట శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు భైరవ కోన విహారయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు సమాచారం. కురిచేడు మండలం పొట్లపాడు వద్ద ఆటోను తప్పించబోయిన బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో నలభై మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమీప ఆసుపత్రికి వారిని తరలించి చికిత్స అందిస్తున్నట్టు స్థానికుల సమాచారం. ఈ ఘటన పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.