telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

శ్రీలంక పేలుళ్ళ పై రాహుల్ విచారం

rahul gandhi to ap on 31st

శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస పేలుళ్ళపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వంద మందికి పైగా మరణించడానికి, 300 మందికి పైగా గాయపడటానికి కారణమైన బాంబు పేలుళ్ళ వార్తలు విని తాను తీవ్ర ఆందోళన చెందినట్లు ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ఉగ్రవాద రాక్షస కృత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ దారుణ మారణ కాండలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఆదివారం ఉదయం 8.45 గంటల ప్రాంతంలో మూడు చర్చిలు, మూడు హోటళ్ళలో బాంబు పేలుళ్ళు సంభవించాయి. అనంతరం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మరో రెండు పేలుళ్ళు జరిగాయి. మొత్తం మీద 187 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. ఈ దాడులకు ఐసిస్ మాడ్యూల్ కారణమని నమ్ముతున్న శ్రీలంక సర్కారు అత్యవసరంగా క్యాబినెట్ సమావేశం నిర్వహించింది. దాడుల అనంతరం పరిస్థితులను సమీక్షించారు. మరికొన్ని గంటలపాటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు.

Related posts