telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

తెలుగు వారి గురించి త్రిలోకసంచారి ఏం అన్నాడంటే…?

అమృతం లాంటిదిమరెక్కడైన ఉందా అని దేవతలు ఒకసారి బ్రహ్మగారిని సందేహం అడిగితే….

అసలు అమృతానికి దీటైనది తెలుగు వారి భోజనం ఒక్కటే అన్నాడు బ్రహ్మగారు!

అదేమిటి అన్నీ మీసృష్టిలో భాగమేకదా! ఇందులో వాళ్ళుచేసిందేముంది అని అడిగారు?

ఈ లోగా త్రిలోకసంచారి చెప్పాడు ఇలా! …….

వాళ్ళకి పులుపుకోసమని మామిడికాయ సృష్టిస్తే దానిని వాళ్ళు ఉప్పు,కారంతో ఆవాలు మెంతులతో ఊరబెట్టి ఇంతులందరు అథ్భుతంగా చమత్కారంగా ఆవకాయ తయారుచేసారు దానికి కొన్ని యుగాలవరకు పేటెంటురైట్సువాళ్ళవే!

పూజచేసుకోండ్రా అని కంద మొక్కని సృష్టిస్తే దానికి బచ్చలిని ప్రియురాలిని చేసి కందా బచ్చలి అనే అధ్బుతమైన సంతర్పణకూరచేసారు!

ఇక వంకాయ అని నల్లని పిల్లని సృష్టిచేస్తే దాన్ని కూరలకే మహారాణీనిచేసి గుత్తికారం ,కొత్తిమీర జతచేస్తే అది కూరవిహారంచేస్తోంది.

ఇక ఎవ్వరు ముట్టుకోరుకదా అని గరుకుని జిగురుని కలిపి పనసని పుట్టిస్తే దాన్నికూడ వదల్లేదు ఈ భోజనరాజులు ! దానికి మహావిందుల్లో పసందైన పొట్టుని ఆవని కలిపి ఆమని రోజుల్లో లాగించేస్తున్నారు .

అలాగని పిచ్చిపిచ్చి ఆకులు సృష్టిస్తే దానికి గోంగురని పేరుపెట్టి పచ్చళ్ళు పులుసులు తో దైవలోకాలదాక వాటి పరిమళాన్ని తాకేలా తయారుచేసి మన ఆడవాళ్ళు ఆ దిక్కుమాలిన అమృతం వద్దని వదిలి ఎక్కడ వీటన్నిటిని తయారుచేస్తారో అని దేవేంద్రుడు భయపడుతున్నాడు.

ఇదినాయన టూకీగా అమృతం కధ!

అనగానే అమృతం బదులువీటన్నిటిని రుచిచూసే భాగ్యం ఎప్పుడాఅని దేవతలు బెంగపెట్టుకుంటే మీ టర్మ్ వచ్చినప్పుడు చూద్దురుగాని అని నారదుడు దీవించాడు.

Related posts