telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హరీశ్ అమెరికా వెళ్లడం వెనుక ఆంతర్యం ఏంటి? : బీజేపీ నేత లక్ష్మణ్

టీఆర్ఎస్ కీలకనేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అమెరికా పర్యటన లో ఉన్నారు. ఫ్లారిడాలో ఉన్న ట్యాంపా నగరంలో ఎన్నారై టీఆర్ఎస్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నారైల ఆత్మీయత చూస్తోంటే తనకు హైదరాబాద్‌లో ఉన్నట్టు అనిపిస్తోందన్నారు. యావత్ దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా మారిందని చెప్పారు. నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు.

మరోవైపు హరీష్ రావు అమెరికా పర్యటన పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 23న ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయని, ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోహరీశ్ అమెరికా వెళ్లడం వెనుక ఆంతర్యం ఏంటి..? ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీకి ఓట్ల శాతం పెరిగిందన్నారు. ఏడు స్థానాల్లో కాంగ్రెస్ మూడో స్థానంతో సరిపెట్టుకోబోతుందన్నారు. కేసీఆర్ ఎన్ని మంచిపనులు చేసిన రెండు మూడు తప్పిదాల వల్ల అప్రదిష్టపాలవుతున్నారని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.

Related posts