telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఫ్లాష్ : ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్…

ఆనంద‌య్య మందు పంపిణీకి ప్ర‌భుత్వం ఎప్పుడు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుందా అనే అంశంపై అందరిలోనూ ఉత్కంఠ నెల‌కొంది.. మ‌రోవైపు.. సోష‌ల్ మీడియాలో కొంద‌రు కేటుగాళ్లు.. కృష్ణ‌ప‌ట్నంలో ఆనంద‌య్య క‌రోనా మందును తిరిగి ప్రారంభించారంటూ త‌ప్పుడు ప్ర‌చారానికి తెర‌లేపారు.. ఇవాళ్టి నుంచే మందు పంపిణీ చేస్తున్నారంటూ పుకార్లు సృస్టించారు. అటు ఆనందయ్య మందు పరిశోధనలో రోజుకో ట్వీస్ట్ చోటు చేసుకుంటుంది. ఒకరేమో పసరు మందు అంటుంటే.. మరొకరు కరోనాకు ఆనందయ్య మందే కరెక్ట్ అని మరీ కొందరి వాదన. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆనందయ్య ఔషధానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంట్లో వేసే డ్రాప్స్ తప్ప.. ఇతర మందులకు అనుమతి ఇచ్చింది. CCRAS నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కంట్లో వేసే డ్రాప్స్‌ విషయంలో పూర్తి నివేదికలు రావాల్సి ఉందని.. నివేదికలు రావడానికి మరో 2–3 వారాల సమయం ఉందని పేర్కొంది ప్రభుత్వం. ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపకూడదని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ..ఇష్టం ఉన్నవారు ఆనందయ్య మందును వాడుకోవచ్చని పేర్కొంది.

Related posts