telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

3rd schedule poling done with peace

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఈ రోజు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేసింది. వచ్చే నెలలో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. జనవరి 7న పురపాలక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈనెల 30న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. డిసెంబర్‌ 31 నుంచి జనవరి 2 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. డిసెంబర్‌ 31వ తేదీన జిల్లా అధికారులతో రాజకీయ పార్టీల సమావేశం నిర్వహిస్తారు.

జనవరి 1న మున్సిపల్‌ కమిషనర్లతో ఈసీ భేటీ అవుతుంది. జనవరి 3న అభ్యంతరాలకు పరిష్కారం, వివరణ ఇస్తారు. జనవరి 4న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నారు. జనవరి 8 నుంచి 10వరకు నామినేషన్లు సమర్పణకు గడువు విధించగా, జనవరి 11న నామినేషన్ల పరిశీలన జరపనుంది. 12, 13వ తేదీల్లో తిరస్కరణకు గురైన నామినేషన్లకు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది. నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 14వరకు గడువు విధించింది. జనవరి 22న పోలింగ్ జరగనుంది. జనవరి 25న ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటించనున్నారు.

Related posts