telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చేతిలో చిల్లిగవ్వలేకుండా నాపెళ్ళి అలా జరిగింది : పూరీ

Puri

తన కెరీర్ 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా చాలా విషయాల గురించి మనసు విప్పి మాట్లాడుతున్నాడు పూరీ. ఈయన జీవితంలో జరిగిన ఓ అద్భుతమైన సంఘటన గురించి చెప్పుకున్నాడు పూరీ. తన పెళ్లి గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు పూరీ జగన్నాథ్. తన పెళ్లి సినిమాటిక్ స్టైల్లో జరిగిందని గుర్తు చేసుకున్నాడు పూరీ జగన్నాథ్. నిన్నే పెళ్లాడతా సినిమాకు పని చేస్తున్న సమయంలోనే తాను ప్రేమలో పడ్డానని.. పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పాడు పూరీ. అప్పటికి తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని.. కానీ స్నేహితులు మాత్రం అప్పుడు తనకు అండగా నిలిచారని చెప్పాడు పూరీ. తన పెళ్లి ఎర్రగడ్డలోని ఓ గుడిలో జరిగిందని గుర్తు చేసుకున్నాడు ఈయన. అప్పటి టాలీవుడ్ టాప్ యాంకర్ ఝాన్సీ తనకు తాళిబొట్టు కొనిచ్చిందని.. ఇక నటి హేమ తనకు పెళ్లి బట్టలు తీసుకొచ్చిందని చెప్పాడు పూరీ జగన్నాథ్. ఇక అక్కడే ఉన్న మరికొందరు స్నేహితులు కూల్ డ్రింక్స్ తెచ్చి ఇచ్చారని చెప్పాడు ఈ సంచలన దర్శకుడు. పెళ్లి బట్టలు కట్టుకుని తాళి బొట్టు కట్టేసి కూల్ డ్రింక్ తాగేసి ఎంచక్కా సాయంత్రం మళ్లీ షూటింగ్ వెళ్లిపోయానని చెప్పుకొచ్చాడు పూరీ.

Related posts