తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నాయకులతో ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందడంతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు చర్చలకు వచ్చారు. ఎర్రమంజిల్‌లో ఉన్న ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం చర్చలు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ జేఏసీ నలుగురు నేతలతో యాజమాన్యం సమావేశమైంది.
ఇంఛార్జీ ఎండీ సునీల్‌శర్మ్ ఆధ్వర్యంలో ఆరుగురు ఈడీలతో కూడిన కమిటీ ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ డిమాండ్ల సాధ్యాసాధ్యలపై చర్చించి నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈడీల కమిటీ నివేదిక అనంతరం యాజమాన్యం ఆర్టీసీ జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించింది. విలీనం మినహా మిగతా 21 డిమాండ్ల అమలుపై సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు చర్చలపై ఉత్కంఠ నెలకొంది.
జగన్ ఢిల్లీ పర్యటన పై టీడీపీ నేతల విమర్శలు