telugu navyamedia
రాజకీయ వార్తలు

మోదీ వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించిన రాహుల్

Rahul gandhi congress

మన్‌ కీ బాత్‌లో భాగంగా ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఇండియాను టాయ్ హబ్‌గా చేయాలని పిలుపునిచ్చారు. పిల్లలు ఆడుకునే బొమ్మలు స్థానికంగానే తయారు చేయాలని అన్నారు. మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యంగ్యంగా స్పందించారు. స్టూడెంట్స్ బొమ్మలపై చర్చ కావాలని కోరుకోవడం లేదని అన్నారు.

విద్యార్థులు పరీక్షలపై చర్చ కోరుకుంటున్నారని రాహుల్ అన్నారు. పరీక్షలపై చర్చ జరగాలని భావిస్తున్నారని సెటైరికల్‌గా రాహుల్ ట్వీట్ చేశారు. జేఈఈ‌‌ నీట్‌విద్యార్థులు ప్రధాని మోడీని పరీక్షల పై చర్చ నిర్వహిచాలని కోరుకుంటున్నారు. కానీ ఆయన బొమ్మలపై చర్చ పెట్టారు అని రాహుల్ ట్వీట్ చేశారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో పరీక్షల నిర్వహణ ఏంటని రాహుల్ ప్రశ్నించారు.

Related posts