telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వచ్చే నెల నుండి వారికీ వ్యాక్సినేషన్ ప్రారంభం…

Corona Virus Vaccine

గత ఏడాది మొత్తం మన దేశాన్ని మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచాన్ని కరోనా వణికించిన విషయం తెలిసిందే. అయితే ఈ జనవరి 16 వ తేదీ నుంచి దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.  తొలివిడతలో ఆరోగ్యకార్యకర్తలకు, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకా అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.  దీనికి అనుగుణంగా దేశంలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.  తొలివిడతలో మొత్తం మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు.  కాగా, రెండో విడతలో వృద్దులకు కరోనా వ్యాక్సిన్ అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.  ఇందులో భాగంగా మార్చి 1 వ తేదీ నుంచి దేశంలోని 60 ఏళ్ళకు పైబడిన వృద్దులకు వ్యాక్సినేషన్ ఇవ్వబోతున్నారు.  అదే విధంగా 45 ఏళ్ళు పైబడి, ఆరోగ్యసమస్యలు ఉన్న వ్యక్తులకు కూడా వ్యాక్సిన్ అందించబోతున్నారు.  మొత్తం 27 కోట్ల మంది వృద్దులకు వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.  నిన్నటి రోజున ప్రధాని నేతృత్వంలోని మంత్రివర్గం సమావేశంలో వృద్దులకు వ్యాక్సినేషన్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. చూడాలి మరి ఈ పేస్ ఎలా నడుస్తుంది అనేది.

Related posts