తెలంగాణలో హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. నియోజకవర్గ పరిధిలోని 302 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు నియోజకవర్గ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలను అక్టోబరు 24న ప్రకటిస్తారు.
కాగా హుజూర్‌నగర్ శాసనసభ స్థానానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఆయన భార్య పద్మావతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగగా.. అధికార టీఆర్‌ఎస్ పార్టీ సైదిరెడ్డిని తమ అభ్యర్థిగా నిలబెట్టింది. బీజేపీ కోటా రామారావుకు బీఫాం ఇచ్చి బరిలో నిలిపింది. ఇక ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక కేసీఆర్ సర్కారుకు సవాలుగా మారింది.
జనసేన కార్యకర్తపై దాడి.. వైసీపీపై పవన్ ఫైర్