telugu navyamedia
సినిమా వార్తలు

‘ది వారియర్’ గా రానున్న రామ్ పోతినేని.

ఎనర్జిటిక్ హీరో రామ్‌ పోతినేని హీరోగా తమిళ స్టార్‌ డైరెక్టర్‌ లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న RAPO 19 అనే వర్కింగ్ టైటిల్‏తో రూపొందుతున్న ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్.

రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రం కి సంబంధించిన టైటిల్‏ను, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.. ‘ది వారియర్‌’ అంటూ మూవీ టైటిల్ ప్రకటిస్తూ.. రామ్ పోతినేని పోలీస్ పాత్రలో ఉన్న లుక్ రివీల్ చేశారు. మొదటి సారి ఈ సినిమాలో రామ్ పోతినేని పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు.

Ram Pothineni clarifies that he is not in any dilemma over the release of  Red | Telugu Movie News - Times of India

తాజాగా విడుదలైన పోస్టర్ లో రామ్ మీసం తో, క్లీన్ షేవ్ తో పోలీస్ అధికారి పాత్ర లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు.దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
తెలుగు మరియు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నారు. శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు

Related posts