telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆస్ట్రేలియాపై 100 సిక్స‌ర్లు బాదిన ఏకైక ఆటగాడిగా రోహిత్…

rohitsharma century record on south africa

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గత ఏడాది మొదట్లో న్యూజిలాండ్ పర్యటనలో గాయపడిన తర్వాత కరోనా కారణంగా ఆలస్యమై యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 లో ఆడాడు. కానీ అందులో కూడా చివర్లో గాయపడిన రోహిత్ మళ్ళీ భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లోని మూడో టెస్టులో బరిలోకి దిగాడు. అయితే ఈ సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ భారీ స్కోరు చేయ‌లేదు కానీ ఓ అరుదైన రికార్డు మాత్రం అందుకున్నాడు. ఇన్నింగ్స్ 16వ ఓవ‌ర్లో నేథ‌న్ ల‌య‌న్ వేసిన బాల్‌ను లాంగాన్ మీదుగా సిక్స్ కొట్టాడు రోహిత్‌. ఇది ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి రోహిత్ కొట్టిన 100వ సిక్స్ కావ‌డం విశేషం. ఇంత వ‌ర‌కూ ఏ ఇత‌ర క్రికెట‌ర్ కూడా ఆస్ట్రేలియాపై 100 సిక్స‌ర్లు బాద‌లేదు. వ‌న్డేల్లోనే ఆసీస్‌పై రోహిత్ 63 సిక్స్‌లు కొట్టాడు. ఈ సిక్స్‌తో ఇంటర్నేష‌న్ క్రికెట్‌లో రోహిత్ శ‌ర్మ సిక్స‌ర్ల సంఖ్య 424కు చేర‌డం విశేషం. ఇక ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన వాళ్ల‌లో రోహిత్ కంటే ముందు ఇద్ద‌రు క్రికెట‌ర్లు ఉన్నారు. అందులో ఒక‌రు విండీస్ విధ్వంస‌క బ్యాట్స్‌మ‌న్ క్రిస్ గేల్  కాగా.. మ‌రొక‌రు పాకిస్థాన్ బ్యాట్స్‌మ‌న్ షాహిద్ అఫ్రిది. ఒక ప్ర‌త్య‌ర్థిపై వంద సిక్స్‌లు కొట్టిన రెండో ప్లేయ‌ర్ రోహిత్‌. ఇంత‌కుముందు ఇంగ్లండ్‌పై అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి గేల్ 140 సిక్స‌ర్లు కొట్టాడు.

Related posts