బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్యహత్య కేసు దేశవ్యాప్త సంచలనంగా మారింది. సుశాంత్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్ సింగ్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సుశాంత్ ఖాతాలో రూ.17 కోట్లున్నాయని, అతని కుటుంబసభ్యులు చెబుతున్నారు. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల దుర్వినియోగం జరిగిందని రూ.15 కోట్ల మేర రియా అవకతవకలకు పాల్పడిందని సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ కు సంబంధించిన ఓ బ్యాంకు ఖాతా నుంచి రూ.15 కోట్లు మళ్లించబడినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. అయితే సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా ఖాతాకు మాత్రం సుశాంత్ అకౌంట్ నుంచి ఎలాంటి నగదు బదిలీ కాలేదని ఇప్పటికే ఈడీ నిర్దారించింది. అలాగైతే ఈ డబ్బు మరి ఎవరి ఖాతాలకు జమ అయిందనే కోణంలో ఈడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇక ఈడీ విచారణలో రియా ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. సుశాంత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే నివాసముంటోన్న ఫ్లాట్ కు సుశాంత్ ఈఎంఐలు చెల్లించేవాడని రియా వెల్లడించినట్లు తెలుస్తోంది. మలాద్ లోని అంకితా ఫ్లాట్ కు సుశాంత్ దాదాపు నాలుగున్నర కోట్లు చెల్లించాడని రియా చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
previous post