telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యువ హీరోతో పూజా హెగ్డే ప్రేమాయణం ?

Pooja-Hegde

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో పూజా హెగ్డే జోరు కొనసాగుతోంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ, వరుస విజయాలను అందుకుంటున్న పూజ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. కెరీర్ తొలినాళ్లలోనే ఈ ‘మొహెంజోదారో’ బ్యూటీ బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. అయితే అక్కడ పూజా ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో తెలుగులో గ్లామర్ గేట్లు ఎత్తేసి, స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే ఇప్పుడు పూజా హెగ్డే బాలీవుడ్ కుర్ర హీరో రోహన్ మెహరాతో డేటింగ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ మెహరా కొడుకు ఈ రోహన్ మెహరా. రోహన్ -పూజా జంట పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్లు వస్తున్న వార్తలు పరిశ్రమలో హీట్ పెంచుతున్నాయి. ‘బాజార్’ అనే సినిమాలో సైఫ్ అలీ ఖాన్, రాధికా ఆప్టే లాంటి స్టార్స్ కలసి నటించి, రోహన్ నటుడిగా మంచి పేరు దక్కించుకున్నాడు. కానీ.. కెరీర్ పరంగా ఈ హీరో ఇప్పటి వరకు మ్యాసీవ్ సక్సెస్ అందుకుంది లేదు. అయితే ఈ విషయంపై వీరిద్దరూ స్పందించలేదు. ఇక రీసెంట్ గా ‘అల వైకుంఠపురములో’ మెరిసి ఆకట్టుకుంది ఈ బుట్టబొమ్మ.

Related posts