telugu navyamedia
రాజకీయ

బెయిల్ పొడిగించాలని కోర్టులో పిటిషన్ వేసిన నవాజ్ షరీఫ్

Nawaz sharif
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్  తన బెయిల్ ను పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు. తన అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ పొడిగించాలని కోర్టుకు విన్నవించారు. బెయిల్ పొడిగించకపోతే చికిత్సకు ఆటంకం కలుగుతుతుందని పిటిషన్ లో పేర్కొన్నారు. తద్వారా క్షమించరాని నష్టం జరుగుతుందని  తెలిపారు. యూకేలో చికిత్స అందించిన వైద్యుల చేత ట్రీట్ మెంట్ ఇప్పిస్తేనే మెరుగైన ఫలితం ఉంటుందని చెప్పారు. 
సుప్రీంకోర్టులో షరీఫ్ తరపు న్యాయవాది వాదిస్తూ, తీవ్రమైన గుండె సంబధిత వ్యాధితో పాటు పలు సమస్యలతో ఆయన బాధపడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో షరీఫ్ బెయిల్ ను పొడిగించాలని కోరారు. షరీఫ్ కు మంజూరు చేసిన షరతులతో కూడిన బెయిల్  గడువు మే 7వ తేదీతో ముగియనుంది.

Related posts