telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆంగ్రేజీ మీడియం : హృదయాన్ని ద్రవింపజేస్తున్న ఇర్ఫాన్ ఖాన్… వీడియో వైరల్

Irrfan

‘హిందీ మీడియం’కు సీక్వెల్ ‘ఆంగ్రేజీ మీడియం’లో ఇర్ఫాన్ కీ రోల్ పోషిస్తున్నారు. హోమీ అదజానియా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. రాధికా మదన్, కరీనా కపూర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కరీనా పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్నారు. 2020, మార్చి 20వ తేదీన చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే తాజాగా “హాలో భాయో..బెహానో..నమస్కార్..మై ఇర్ఫాన్..” అంటూ ఉన్న వీడియో హృదయాలను కదిలించి వేస్తోంది. నటుడు ఇర్ఫాన్ ఖాన్ పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. ‘ఆంగ్రేజీ మీడియం’ సినిమాకు సంబంధించిన పోస్టర్ ‌రిలీజ్ సందర్భంగా ఇర్ఫాన్ ఓ వీడియోను రూపొందించారు. ప్రజలతో ఉంటానో..ఉండనో తెలియడం లేదని తెలిపారు. ఎంత ప్రేమతో సినిమాను చేశామో..అంతే ప్రేమతో ప్రమోట్ చేయాలని అనుకుంటున్నామన్నారు. కానీ తన శరీరంలో తెలియని వ్యాధి ఉందని, ప్రస్తుతం దానితో కొట్లాడుతున్నట్లు తెలిపారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదన్నారు. సినిమాకు పాజిటివ్‌గా రూపొందించడం జరిగినట్లు, ఈ సినిమా ఏడిపిస్తుందని, నవ్విస్తుందనే నమ్మకం ఉందన్నారు. 2020, ఫిబ్రవరి 13వ తేదీ గురువారం చిత్ర ట్రైలర్ విడుదలవుతుందన్నారు. ఫిబ్రవరి 11వ తేదీన ఇర్ఫాన్ ఈ వీడియోను రిలీజ్ చేయగా..42 లక్షల మందికి పైగా వ్యూస్ లభించాయి. ఇక అరుదైన న్యూరోయెండోకైన్ ట్యూమర్ వ్యాధితో బాధ పడుతున్నాడు. ఇటీవలే లండన్‌‌కు వెళ్లి చికిత్స చేయించుకుని వచ్చారు.

Related posts