telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆచార్య” బడ్జెట్ తగ్గింపు ?

chiru

మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. అందువల్ల మళ్ళీ టాలీవుడ్ తిరిగి మాములు స్థితికి చేరుకునేవరకు భారీ బడ్జెట్ సినిమా చేయకుంటే మంచిది అని చిరంజీవి ప్రొడ్యూసర్లకు అందరికి సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఆయన ఇదే విషయాన్ని మెగా నిర్మాతలైన అల్లు అరవింద్, రామ్ చరణ్ లకు కూడా చెప్పారంట. అందువల్ల రామ్ చరణ్ ఇప్పుడు నిర్మిస్తున్న “ఆచార్య” సినిమా బడ్జెట్ తగ్గిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమా షూటింగ్ తిరిగి మరల ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది తెలియాలి.

Related posts