telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

రాణించిన ఆసీస్ టాప్ ఆర్డర్… భారత లక్ష్యం..?

more security to indian team as threaten call

ఐపీఎల్ 2020 ముగిసిన వెంటనే భారత జట్టు ఆసీస్ కు వెళ్ళింది. ఈరోజు భారత్-ఆసీస్ ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఆసీస్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ లో ఆసీస్ టాప్ ఆర్డర్ అద్భుతంగా రాణించింది. మొదటి వికెట్ కు ఓపెనర్లు ఇద్దరు 156 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ (69) అర్ధశతకం చేసి వెనుదిరిగాడు. కానీ మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ మాత్రం 74 బంతుల్లో 114 పరుగులతో శతకం బాదేశాడు. అయితే వన్ డౌన్ లో వచ్చిన స్మిత్ 66 బంతుల్లో 105 పరుగులతో మరో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక చివర్లో మాక్స్వెల్ 19 బంతుల్లో 45 పరుగులతో రెచ్చిపోవడంతో ఆసీస్ నిర్ణిత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు తీసుకోగా బుమ్రా, సైని, చాహల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో గెలవాలంటే కోహ్లీ సేన 375 పరుగులు చేయాలి. అయితే ఆసీస్ జట్టు అంటూనే ఓపెనర్ శిఖర్ ధావన్ రెచ్చిపోతాడు. అతనికి తోడుగా కోహ్లీ, రాహుల్ రాణిస్తే ఈ భారీ టార్గెట్ ను భారత చేధించగలదు… మరి ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి.

Related posts