telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు తొలగాలని….

ప్రజాసంకల్పయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో 97 శాతం నెరవేర్చారని ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అభిప్రాయం వ్యక్తంచేశారు. తిరుమలేశుని దర్శనార్థం వచ్చిన ఆయన రాష్ట్రాల్లో విపత్కర పరిస్థితులు కనుమరుగు కావాలని వేడుకున్నారు.

ఆర్థిక ఇబ్బందులు, మూడు రాజధానుల విషయం, పోలవరం ప్రాజెక్టు సమస్యలు సమసిపోవాలని శ్రీవెంకటేశ్వరస్వామివారిని ప్రార్థించామన్నారు. వచ్చే జనవరినుంచి వృద్ధాప్యపెన్షన్లు, వితంతు పెన్షన్లు 2500లకు పెంచామన్నారు. పెంచిన పెన్షన్లు 2022నుంచి అమల్లోకి వస్తాయన్నారు.

నైవేద్య విరామ సమయంలో మంత్రి అవంతి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వదించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ధనుర్మాసం ప్రారంభం రోజున శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.

Related posts