బోన్ క్యాన్సర్‌తో బాధపడుతోన్న అనంతపురం నగరానికి చెందిన స్వప్న అనే ఇంటర్ విద్యార్థిని గురించి తెలుసుకున్న హీరో నందమూరి బాలకృష్ణ ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ రప్పించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌లో స్వప్నకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆమెకు శస్త్రచికిత్స చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉన్న స్వప్నను బాలయ్య మంగళవారం పరామర్శించారు. స్వప్నతో కాసేపు సరదాగా మాట్లాడారు. భయపడాల్సింది ఏమీ లేదని, అండగా తానున్నానని స్వప్నకు ఆమె తల్లికి ధైర్యం చెప్పారు. స్వప్న ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. బసవతారకం హాస్పిటల్‌కు నందమూరి బాలకృష్ణ మేనిజింగ్ ట్రస్టీ, చైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. స్వప్నకు బసవతారకం హాస్పిటల్‌లో ఆపరేషన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం స్వప్నకు బాలకృష్ణ ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. తానున్నానని ధైర్యం చెబుతున్నారు.