యంగ్ హీరో సత్యదేవ్ కెరీర్ మొదటి నుంచి విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల వచ్చిన జార్జిరెడ్డి సినిమాలో కీలక పాత్ర పోషించిన సత్యదేవ్… రీసెంట్‌గా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే డిఫరెంట్ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఇప్పుడు చిరంజీవి చేస్తున్న లూసిఫర్ రీమేక్‌లోనూ ఛాన్స్ కొట్టేశాడు సత్యదేవ్. విలన్‌గా లేదంటే సీఎం పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. బ్లఫ్ మాస్టర్ అనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన సత్యదేవ్-గోపి గణేష్ కాంబో ఇప్పుడు మరో కొత్త గెటప్‌లో కనిపించనున్నాడు. సత్యదేవ్ కొత్త సినిమాలో గాడ్సే అవతారమెత్తనున్నాడు. సత్యదేవ్ హీరోగా గోపి గణేష్ తెరకెక్కనున్న ఈ సినిమాను సి. కళ్యాణ్ నిర్మించనున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ ఫస్ట్ లుక్ అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. కాగా.. ఇటీవలే సత్యదేవ్ తిమ్మరుసు అనే మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా టీజర్ కూడా రిలీజ్ అయింది. ఇలా వరుసగా సత్యదేవ్ సినిమాలు తీసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
previous post