telugu navyamedia
సినిమా వార్తలు

ఈసారైనా ఈ కాంబో హిట్టు కొట్టేనా ?

Akhil images
అక్కినేని వారసుడు అఖిల్ వెండితెరపై ఇప్పటికే ముచ్చటగా మూడు డిజాస్టర్లను అందుకున్నారు. సినిమాకు సినిమాకూ నటనలో, డ్యాన్స్ లో, ఫైట్స్ లో పరిణతి చెందుతున్నా… అఖిల్ కు మాత్రం సరైన కథా, కథనం దొరకట్లేదు. ఇక ఈ మధ్య అఖిల్ నాలుగవ సినిమాకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే అఖిల్ నాలుగవ సినిమాకు దర్శకులుగా క్రిష్, శ్రీనువైట్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ బొమ్మరిల్లు భాస్కర్ లైన్‌లోకి వచ్చాడు. “బొమ్మరిల్లు, పరుగు లాంటి చిత్రాలతో మంచి హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు భాస్కర్. కానీ భాస్కర్ నుంచి ఆ తర్వాత వచ్చిన ఆరెంజ్, ఒంగోలు గిత్త చిత్రాలు భారీ డిజాస్టర్ కావడంతో ఆయన కెరీర్ అగాధంలో పడింది. అయితే గతకొన్ని రోజుల నుంచి గీతా ఆర్ట్స్ లో భాస్కర్ సినిమా ఉంటుందనే వార్తలు విన్పిస్తున్నాయి. ఇప్పుడేమో అఖిల్, భాస్కర్ కాంబినేషన్‌లో గీతా ఆర్ట్స్ అనుంబంధ సంస్థ, జీఏ 2 పిక్చర్స్ బ్యానర్‌పై, అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీవాసు నిర్మాతగా ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. వేసవి నుండి షూటింగ్ మొదలు కానుంది. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

Related posts