బిగ్ బాస్ షో లో జరిగే ఘటనలు రోజురోజుకు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేపుతున్నాయి. కానీ బిగ్‌బాస్ షోలో ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదరుచూసే ఎలిమినేషన్ పార్ట్, వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి సోషల్ మీడియాలో ముందుగానే లీకైపోతున్నాయి. ఈ రోజుతో 10 వారాలు పూర్తి చేసుకుంది బిగ్‌బాస్ 3. ఈ వారం వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, శ్రీముఖి, రవి నామినేట్ కాగా… బిగ్‌బాస్ హౌస్ నుండి రవికృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పటికే బిగ్‌బాస్ తనకిచ్చిన టాస్క్ విషయంలో బాగానే ఆడుతున్నాడు రవి. ఓటింగ్‌లోనూ రవికే తక్కువ వచ్చాయి. అందుకే ఈవారం బిగ్‌బాస్ హౌస్ నుంచి రవికృష్ణను బయటకు పంపించారు. ఇటీవల బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు ఇటీవల సరదాగా కూర్చుని ఓ విషయాన్ని చర్చించుకున్నారు. ఒకవేళ హౌస్ నుంచి ఎలిమినేట్ అయితే, తాము ఏం చేస్తామో అందరూ చెప్పారు. రవికృష్ణ కూడా తాను ఎలిమినేట్ అయితే వెంటనే విజయవాడలోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్తానని చెప్పాడు. దీంతో అతడికి బిగ్ బాస్ టికెట్ ఇచ్చి పంపాడు. గత వారం ఆల్రెడీ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన అలీ రజా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
previous post