telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఇది కూడా షుగర్ ను .. అదుపులో ఉంచుతుంది.. !

beans best to control sugar levels

సాధారణంగా ఆకుపచ్చటి వాటిలో మనశరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. ఆ జాతికే చెందిన బీన్స్‌లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఎన్నో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ వాటిలో ఉంటాయి. ఈ క్ర‌మంలో త‌ర‌చూ బీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే పలు లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న వారు రోజూ బీన్స్‌ను తింటే వారి షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయ‌ని సైంటిస్టులు తాజాగా చేసిన ప‌రిశోధ‌న‌లలో తేలింది.

ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండటంతో, ఇది ర‌క్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిల‌ను నియంత్రిస్తుంది. అందువ‌ల్లే బీన్స్‌ను తిన‌డం వ‌ల్ల షుగ‌ర్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాదు.. బీన్స్ తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌ల‌తో పాటు అధిక బ‌రువును కూడా తగ్గించుకోవ‌చ్చ‌ని వారు అంటున్నారు. అయితే బీన్స్‌ను ఉడ‌కబెట్టుకుని తిన‌డం శ్రేయ‌స్క‌రం. ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని ఫ్రై చేసుకుని తిన‌రాదు..!

Related posts