telugu navyamedia
సినిమా వార్తలు

లీక్ : “మహర్షి”లో అల్లరి నరేష్ పాత్ర

Maharshi

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా, సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం “మహర్షి”. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మొదటి పాటకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రంలో అల్లరి నరేష్ పాత్ర గురించి ఓ బిట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

అల్లరి నరేష్, మహేష్, పూజ హెడ్గే ముగ్గురూ చిన్ననాటి ఫ్రెండ్స్. అయితే మహేష్ తన చదువు నిమిత్తం అమెరికా వెళ్లి అక్కడ సెటైలై కోట్లు సంపాదించి, అక్కడి లైఫ్ స్టైల్ లో కలిసిపోతాడు. అయితే ఓ రోజు అనుకోకండా అల్లరి నరేష్ ఆత్మహత్యా ప్రయత్నం చేసాడని మహేష్ కు తెలుస్తుంది. దాంతో తట్టుకోలేక స్నేహితుడికి వచ్చిన కష్టం తెలుసుకోవడానికి ఇండియా వస్తాడు. అయితే అక్కడకు వచ్చిన మహేష్ కు నరేష్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి దారి తీసిన పరిస్దితులు వ్యవసాయం అని తెలుసుకుంటాడు. ఆ క్రమంలో ఇక్కడ రైతు ఎంత కష్టమైన జీవితం గడుపుతున్నాడో అర్దం చేసుకుని, వారి సమస్యలు తీర్చాలనుకుంటాడు. ఈలోగానే నరేష్ చనిపోతాడు. అతని మరణం మహేష్ ను తీవ్రంగా కలచివేస్తుంది. ఇక్కడే ఉండి అధునాతన పద్దతులు ఇంట్రడ్యూస్ చేస్తూ వ్యవసాయాన్ని ఇంప్రూవ్ చేసి, మరికొన్ని చావులు ఆపాలనుకుంటాడు. దీంతో రుషి కాస్తా మహర్షి అవుతాడు. ఇదే ఈ సినిమాలో కీలకమైన పాయింట్ అని చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ అంచనాలను మరింతగా పెంచేస్తోంది. మహర్షి డిజిటల్ రైట్స్ అందరికీ షాకిస్తున్నాయి. “మహర్షి” సినిమా డిజిటల్ రైట్స్ ను 11కోట్లకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు సమాచారం. మహేష్ “భరత్ అనే నేను” సినిమాతో పోల్చితే “మహర్షి” హై రేంజ్ లో బిజినెస్ చేస్తోంది.

Related posts