telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వకీల్ సాబ్” కథలో మార్పులు… క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vakeel-Saab

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పింక్’కు ఇది రీమేక్. అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను ఇక్కడ పవన్ కళ్యాణ్ పోషిస్తుడటంతో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలో చాలా మార్పులు చేసారని వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ వార్తలపై దర్శకుడు వేణు శ్రీరామ్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…మేము సినిమాను నిజాయితీగా రీమేక్ చేస్తున్నాం. చాలా తక్కువ సీన్స్ మాత్రమే మార్చడం జరిగింది. ఎక్కువ శాతం సీన్స్ ను ఉన్నది ఉన్నట్లుగానే చేస్తున్నాం. మూల కథలో ఎలాంటి మార్పు లేకుండానే “వకీల్ సాబ్”ను తెరకెక్కిస్తున్నాము. డిసెంబర్ వరకు సినిమా షూటింగ్ పూర్తి చేస్తాం” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో ఐదు పాటలు ఉంటాయని , వకీల్ సాబ్ షూటింగ్ కోసం పవన్ అక్టోబర్ లేదా నవంబర్ లో వచ్చే అవకాశం ఉందని అన్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్‌గా కనిపించబోతుండగా.. నివేదా థామస్, అంజలి, అనన్యలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి మోషన్ పోస్టర్‌ను విడుదల చేయగా… భారీ స్పందన వచ్చింది. కాగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 90 శాతం పైగా పూర్తి చేసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

Related posts