telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

తాగి ఉబెర్ బుక్ చేసిన యువతి… బిల్ చూస్తే…!?

Uber

లండన్‌లో ఓ యువతి తాగిన మత్తులో ఇంటి అడ్రస్ బదులుగా చదువుకుంటున్న యూనివర్శిటీ అడ్రస్ పెట్టి ఉబెర్ క్యాబ్ బుక్ చేసింది. క్యాబ్‌లో నిద్రపోయిన యువతి చాలా దూరం ప్రయాణం చేసింది. దిగాల్సిన అడ్రస్ రాగానే డ్రైవర్ యువతిని నిరలేపాడు. బిల్లు ఎంతైందని అడిగింది. డ్రైవర్ మూడు వందల పౌండ్లు(రూ. 27 వేలకు పైగానే) అయిందని చెప్పాడు. అది విన్న యువతికి దెబ్బకు తాగింది మొత్తం దిగిపోయింది. తన ఫోన్‌ను చూసుకోగా ఇంటి అడ్రస్(న్యూ క్యాజిల్) బదులుగా తాను చదువుకున్న యూనివర్శిటీ అడ్రస్ పెట్టినట్టు తెలుసుకుంది. రాత్రి సమయంలో ఇంక చేసేదేం లేక మళ్లీ యూటర్న్ తిప్పమంది. అలా రాత్రి ఒంటి గంటకు బయలుదేరిన యువతి నాలుగు గంటలకు ఇంటికి చేరుకుంది. మళ్లీ వెనక్కు రావడంతో అదనంగా మరో 100 పౌండ్లు.. అంటే మొత్తంగా 400 పౌండ్లు(రూ. 36 వేలు) బిల్లు కట్టింది. హోటల్‌లో ఉంటే ఎక్కువ ఖర్చు అవుతుందని.. ఉబెర్ బుక్ చేసుకున్నానని, చివరకు రూ.36 వేల బిల్లు కట్టాల్సి వచ్చిందని యువతి ఆవేదన వ్యక్తం చేసింది.

Related posts