telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎన్టీఆర్‌‌కు కుటుంబసభ్యుల నివాళి

NTR Ghat Balakrishana Jr. NTR

స్వర్గీయ నందమూరి తారకరామారావు 23వ వర్ధంతి సందర్భంగా  హైదరాబాద్ లోని  ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. నందమూరి బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, హరికృష్ణ కుమార్తె సుహాసిని, సినీ దర్శకుడు క్రిష్‌ తదితరులు పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ స్ఫూర్తిగా తెలుగువారంతా ముందుకు సాగాలన్నారు. తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్‌ అని ఆయన కొనియాడారు. ఒక మనిషి మహోన్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం ఉండాలని బాలయ్య వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిలో నిలిచి ఉంటారని పేర్కొన్నారు.

Related posts