telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లు .. రాష్ట్రపతి ఆమోదముద్ర … అక్టోబర్-31 నుంచి అమలు…

Ram Nath Kovind

ఈనెల 5 వ తేదీన ఆర్టికల్ 370 రద్దు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వెంటనే రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం, అదే రోజున గెజిట్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు బిల్లును ప్రవేశపెట్టిన రోజునే జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లును కూడా ప్రవేశపెట్టారు. రాజ్యసభలో ఈ బిల్లు ఆగస్ట్-5,2019న రాజ్యసభ ఆమోదం పొందగా, ఆగస్టు-6,2019న లోక్ సభలో ఆమోదం పొందింది. పార్లమెంట్ లో ఈ బిల్లు పాస్ కావడంతో రాష్ట్రపతి ఇవాళ(ఆగస్ట్-9,2019) ఆ బిల్లుకు ఆమోదముద్ర వేశారు. దీనికి సంబంధించిన గెజిట్ ను రిలీజ్ చేశారు.

ఇక నుంచి జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిపోయాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా మారితే.. లడక్ మాత్రం అసెంబ్లీలేని కేంద్రపాలిత ప్రాంతంగా మారిపోయింది. సర్థార్ వల్లభాయ్ పటేల్ 144వ జయంతి రోజైన అక్టోబర్-31 నుంచి లఢఖ్, జమ్మూకశ్మీర్ లె వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా అమల్లోకి రానున్నయని హోం మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Related posts