telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు… హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Himachal

హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. కేంద్రం విధించిన లాక్‌డౌన్ మే 31తో ముగుస్తున్న వేళ తమ రాష్ట్రంలో మరో 5 వారాల పాటు లాక్‌డౌన్ కొనసాగించనున్నట్లు సోమవారం (మే 25) ప్రకటించింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో లాక్‌డౌన్ కొనసాగుతుందని ఈ హిమాలయ రాష్ట్రం స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటివరకు 214 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 63 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 145 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో నాలుగు వంతు కేసులు ఒక్క హమీర్‌పూర్ జిల్లాలోనే నమోదయ్యాయి. హమీర్‌పూర్‌లో 63 కేసులు నమోదు కాగా, సోలన్ జిల్లాలో 21 కేసులు నమోదయ్యాయి. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లి తిరిగొస్తున్న వారిలో పలువురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో హిమాచల్ ప్రదేశ్‌లో జైరామ్ థాకూర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ 6 రోజుల్లో ముగుస్తుందనగా.. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

Related posts