ప్రపంచవ్యాప్తంగా 17 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అశేష ప్రజానీకాన్ని వణికిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాల ప్రభుత్వాలు కరోనా కట్టడి కోసం పెద్దఎత్తున పోరాటం చేస్తున్నాయి. లాక్‌డౌన్ అమలు చేస్తూ సహాయక చర్యలు చేపడుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు సైతం కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ ప్రజలకు తగు సూచనలిస్తున్నారు. ఇందులో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ కోటి.. ‘సేవ్ ద వరల్డ్’ పేరుతో ఓ పాటను రూపొందించి విడుదల చేశారు. ఈ పాటలో ప్రకృతిని కాపాడుకోకుంటే జరిగే నష్టాలను వివరిస్తూ ‘ఏమిటి నీ సమాధానం?’ అంటూ చైతన్య పరిచారు. శ్రీనివాస మౌళి అందించిన లిరిక్స్‌పై కొడుకు రోషన్‌తో కలిసి ఈ పాటను స్వరపరిచారు కోటి. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో పరిసరాల పరిశుభ్రత అవసరాన్ని గుర్తుచేస్తూ సాగిన ఈ పాట అందరి మెప్పు పొందుతోంది. గతంలో కూడా కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌లతో ఓ పాట రూపొందించి భేష్ అనిపించుకున్నారు కోటి. ఈ సాంగ్ చూసి భారత ప్రధాని మోడీ సైతం ప్రశంసించారు.
previous post
పెళ్ళైన తరువాత కూడా శత్రుఘ్న సిన్హా ఎఫైర్… భార్య కామెంట్స్