ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఇస్మార్ట్ శంకర్” గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “ఇస్మార్ట్ శంకర్” చిత్రంలో రామ్ సరసన నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా మణిశర్మ సంగీతం అందించాడు . ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు సినిమాకు భారీగానే కలెక్షన్లు వచ్చాయి. మొదటి రోజు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8 కోట్లు కొల్లగొట్టింది. పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పూరీ తాను ఆల్రెడీ “ఇస్మార్ట్ శంకర్” చిత్ర సీక్వెల్ “డబుల్ ఇస్మార్ట్” పేరుతో ఈ చిత్రం తీయబోతున్నానని ప్రకటించేశాడు. “ఇస్మార్ట్ శంకర్” హిట్ అయిన సందర్భంగా పూరి మీడియాతో మాట్లాడుతూ మహేష్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూలో పూరి మాట్లాడుతూ “మహేష్ కంటే నాకు మహేష్ అభిమానులంటే ఎక్కువ ఇష్టం. మహేష్ తో చాలా మంచిసినిమాలు చేశానని వాళ్ల ఫీలింగ్ అందుకే వాళ్లు “జనగణమన” చిత్రాన్ని మహేష్ తో చేయమని అన్నారు. కానీ నేను హిట్స్‌లో ఉంటేనే మహేశ్ నాతో సినిమాలు చేస్తాడు. మహేష్ కంటే ఆయన అభిమానులంటేనే ఎక్కువ ఇష్టమని వారికి చెబుదామని చాలా సార్లు అనిపించింది” అన్నారు. “ఇస్మార్ట్ శంకర్”తో హిట్ కొట్టారు కదా… ఇప్పుడు మళ్లీ మహేష్ మీతో సినిమాలు చేస్తారేమో ?” అనే ప్రశ్నకు పూరి స్పందిస్తూ “నేను ఓకే చెప్పాలంటే నాకు కూడా ఓ క్యారెక్టర్ ఉంటుంది కదా”అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక మహేష్ ను బాక్సాఫీస్ వద్ద సూపర్‌స్టార్‌ని చేసిన సినిమా “పోకిరి”ని తెరకెక్కించింది పూరియే. తర్వాత “బిజినెస్‌మేన్” కూడా భారీ హిట్ అయ్యింది.
previous post
next post
హృతిక్ చూడు నిన్ను కంగనా ఏం చేస్తుందో… కంగనా సోదరి హెచ్చరిక