telugu navyamedia
Uncategorized

ఆసక్తి రేపుతున్న ‘మోహన్‌ దాస్’ టీజర్

mohandas

వాస్తవ కథ ఆధారంగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘మోహన్‌ దాస్’. విష్ణు విశాల్ హీరోగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు ముర‌ళీ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. కేఎస్ సుందర‌మూర్తి సంగీతం అందిస్తున్నారు. తాజాగా చిత్ర టైటిల్ రివీల్ చేస్తూ.. విడుదల చేసి టీజర్ ఆసక్తికరంగా వుంది. ‘చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు’ అని చెప్పడానికి సింబాలిక్‌గా వాడే మూడు కోతిబొమ్మలను చూపిస్తూ ఈ టీజర్‌ని ఎంతో ఆసక్తికరంగా కట్ చేశారు. ఒక నిమిషం 20 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్‌లో కేవలం హీరో విష్ణు విశాల్ తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదు. విష్ణు విశాల్ సుత్తెతో ఎవరినో చంపుతున్న సీన్ చూపిస్తూ సస్పెన్స్ క్రియేట్ చేశారు. ఇది ఓ సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది. ‘ఈ రోజు మీరు ఏం చేస్తారో దానిపైనే మీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది’ అని మహాత్మ గాంధీ చెప్పిన కొటేషన్ చూపిస్తూ స్టార్ట్ అయిన ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

Related posts