మెగా బ్రదర్ నాగబాబు తాజాగా పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఒక పాత ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ‘ఇలాంటి ఫోటోలు చాలా ఉన్నాయి, నా దగ్గర దాచానంతే !’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఆ తర్వాత మరో ఫోటోను షేర్ చేసాడు నాగబాబు. ఆ ఫోటోలో నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. పైగా దానికి క్యాప్షన్ గా “బ్రదర్స్ టు గ్యదర్.. ఒకరు సొంత తమ్ముడు.. మరొకరు బ్రదర్ ఫ్రమ్ అదర్ మదర్…” అని రాసుకొచ్చాడు. అలాగే పవర్ స్టార్, నందమూరి సింహాన్ని కలిసిన రోజుది ఈ ఫోటో అని పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇక కొన్ని రోజుల క్రితం నందమూరి బాలకృష్ణ పైన నాగబాబు పలు విమర్శలు చేసారు. గతంలో సినిమా పెద్దలు షూటింగ్స్ కు అనుమతులు అడిగే సమయంలో బాలకృష్ణను ఆహ్వానించకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ విషయంలో కూడా నాగబాబు రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే నాగబాబు ఎవరైనా మెగా ఫ్యామిలీపై విమర్శలు చేస్తే నాగబాబు బహిరంగంగానే వారిపై విరుచుపడతారు.
previous post