telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మళ్ళీ తెరపైకి వచ్చిన దిశ ఎన్ కౌంటర్ చిత్రం..

Disha

గత ఏడాది హైదరాబాద్‌ నగర శివారులో జరిగిన దిశ హత్య కేసు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో దిశపై లైంగిక దాడి..హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు అదే ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ చేశారు. అయితే. ఈ ఘటనని ఆధారంగా చేసుకుని వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ “దిశ ఎన్‌కౌంటర్‌ ” అనే సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమాకు ఫస్ట్‌లుక్, ట్రైలర్‌ను విడుదల చేశారు రాం గోపాల్‌ వర్మ. అయితే ఇప్పటికే ఈ సినిమా ఆపాలంటూ కోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. తాజాగా మరోసారి ఈ సినిమా వివాదం తెరపైకివచ్చింది.

మరోసారి సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిషన్ ను దిశ నిందితుల కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. ఎన్ కౌంటర్ గురైన జోళ్లు శివ, జోళ్ళు నవీన్, చెన్నకేశవులు, హైమ్మద్ ఆరీఫ్ కుటుంబ సభ్యులు..జ్యుడీషియల్ కమిషన్ లో ఫిర్యాదు చేసారు. ఈ చిత్రం లో తమ వాళ్ళను విలన్స్ గా పెట్టి చేడు గా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్న కుటుంబ సభ్యులు. ఈ చిత్రం తీయడం వలన కుటుంబ సభ్యుల జీవించే స్వేచ్ఛ కు భంగం కలుగుతోందని వాపోయారు. కుటుంబ సభ్యులతో పాటు పెరుగుతున్న పిల్లల మీద ఈ చిత్రం తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఫిర్యాదు చేసారు. చనిపోయిన వారిని ఈ చిత్రం తీసి ఇంకా చంపుతున్నారని కమిషన్ కు కుటుంబ సభ్యులు తెలుపున్నారు. సుప్రీంకోర్టు నియమించిన కమీషన్ కు విరుద్ధంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారని..ఒక పక్క ఎంక్వయిరీ కొనసాగుతుంటే దిశ కథను ఎలా తెరకెక్కిస్తారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. వెంటనే రామ్ గోపాల్ తీస్తున్న చిత్రాన్ని నిలిపి వెయ్యాలని కమిషన్ ను తెలిపారు.

Related posts