telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విశ్వక్‌ సేన్‌ హీరోగా ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’

వెళ్లిపోమాకే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అలియాస్ విశ్వక్ సేన్ 2018లో విడుదలైన ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. తరువాత ఏడాది ఫలక్‌నామా దాస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా గుర్తింపు పొంది విశ్వక్ వెంటనే పోలీస్‌గా థ్రీల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఔరా అనిపించాడు. హిట్ సినిమాతో అతడికి భారీ గుర్తింపు వచ్చింది.  మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా తన 7వ చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ చిత్రానికి ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే బ్యూటీఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అర్జున పాత్రలో కనిపించబోతున్నాడు. దర్శకుడు విద్యా సాగర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో, ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్ మీద ఆయన తనయుడు బాపినీడు సుధీర్ ఈదరతో కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకూ మాస్ చిత్రాలతో అలరించిన విశ్వక్ సేన్ ఇప్పుడు క్లాస్ టైటిల్ తో రావడం విశేషం. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో నిన్న ప్రారంభమైంది. ఇక గతంలో ‘ఫలక్ నుమా దాస్, హిట్’ చిత్రాలతో హిట్లు తన ఖాతాలో వేసుకున్న విశ్వక్ ప్రస్తుతం ‘పాగల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించబోయే ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని దిల్ రాజు సమర్పించారు లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. ఈ చిత్రం 1 మే 2021 న థియేటర్లలో విడుదల కానుంది

Related posts