మాస్ మహారాజా రవితేజను ఇండస్ట్రీలో నిలబెట్టిన సినిమా ‘ఇడియట్’. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా కన్నడ బ్యూటీ రక్షిత హీరోయిన్‌గా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఆ తరవాత ఎన్టీఆర్, మహేష్ బాబు, నాగార్జున, చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించారు. కెరీర్ మంచి రేంజ్‌లో దూసుకుపోతున్న సమయంలో కన్నడ దర్శకుడు ప్రేమ్‌ను వివాహం చేసుకున్నారు. 2007లో వీరి వివాహం జరిగింది. పెళ్లి చేసుకున్న తరవాత రక్షిత మళ్లీ సినిమాల వైపు చూడలేదు. కానీ, పలు కన్నడ టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే, అప్పుడు ‘ఇడియట్’ సినిమాలో రక్షితను చూసినవాళ్లు ఇప్పుడు అకస్మాత్తుగా ఆ కన్నడ కస్తూరిని చూస్తే షాక్‌కు గురికాక తప్పదు. ఎందుకంటే, అస్సలు ఊహించని విధంగా మారిపోయారామె. హీరోయిన్‌గా ఉన్నప్పుడు మంచి స్ట్రక్చర్ మెయింటెయిన్ చేసిన రక్షిత.. ఇప్పుడు బాగా లావెక్కారు. తాను ఏ విధంగానూ మళ్లీ వెండితెరపై కనిపించనని ఇప్పటికే రక్షిత స్పష్టం చేశారు. తాజాగా, రక్షిత ఫొటో ఒకటి బయటికి వచ్చింది. వాలంటైన్స్ డే రోజున జరిగిన ఒక ఈవెంట్‌లో తీసిన ఫొటోలా అనిపిస్తోంది. ఈ ఫొటోలో భర్త ప్రేమ్ నుంచి రక్షిత లవ్ బెలూన్‌ను అందుకుంటున్నారు.
previous post
నగ్నత్వానికి బానిసయ్యాను… హీరో వ్యాఖ్యలు