telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

రోహిత్ తిరిగి రావడం పై మేము సంతోషిస్తున్నాము : రహానే

rohit sharma records in 3rd test on south africa

తాజాగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ పై 8 వికెట్ల తేడాతో భారత్ ఓజయం సాధించింది. 4 మ్యాచ్ ల ఈ సిరీస్ లో అడిలైడ్‌లో పరాజయం పొందిన టీం ఇండియా ఈ విజయం తో సిరీస్ ను 1-1తో సమం చేసింది. అయితే సిడ్నీలో జనవరి 7 నుంచి ఆసీస్ తో ప్రారంభం కానున్న 3వ టెస్ట్ లోకి రోహిత్ శర్మను ఆహ్వానించడం ఉత్సాహంగా ఉందని భారత కెప్టెన్ అజింక్య రహానే తెలిపాడు. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 లో గాయపడిన రోహిత్ వెంటనే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ పరీక్షను క్లియర్ చేసి 2వ టెస్ట్ కంటే ముందే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాడు. కానీ అకాడమికి చేరిన తర్వాత పాటించాల్సిన కరోనా నియమాల కారణంగా ఈ మ్యాచ్ లో ఆడలేకపోయాడు. కానీ రేపటితో రోహిత్ క్వారంటైన్ గడువు ముగియనుంది. ఆ తర్వాత జట్టుతో కలిసి శిక్షణ ప్రారంభిస్తాడు హిట్ మ్యాన్. అయితే సిడ్నీలో జరిగే 3వ టెస్టుకు ఇంకా 8 రోజులు ఉండటంతో, రోహిత్ కు శిక్షణ తీసుకోవడానికి తగినంత సమయం ఉంది. ఇక రెండో టెస్ట్ అనంతరం రహానే మాట్లాడుతూ…  రోహిత్ తిరిగి జట్టులోకి రావడం పట్ల మేము సంతోషిస్తున్నాము. నేను నిన్న రోహిత్ తో మాట్లాడాను, అతను జట్టులో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు” అని రహానే అన్నాడు. మరి మూడో టెస్టులో రోహిత్ ఆడుతాడా… లేదా అనేది చూడాలి.

Related posts