telugu navyamedia
రాజకీయ వార్తలు సినిమా వార్తలు

ఈ నెల 31న ఆ హీరో పార్టీ ప్రకటించనున్నాడా…?

Vijay

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమయం దగ్గర పడుతుండడంతో.. ఆ రాష్ట్ర పాలిటిక్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.. ఇప్పటికే  లోక నాయకుడు కమల్ హాసన్  తన రాజకీయ పార్టీ అనౌన్స్ చేయగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరలో రాజకీయ పార్టీ అంటూ ప్రకటించి.. అనారోగ్య కారణాల రీత్యా వెనక్కి తగ్గి.. నో పాలిటిక్స్ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు.. దీంతో.. మరోస్టార్  హీరో ఇప్పుడు తమిళ పొలిటిక్‌ స్క్రీన్‌పైకి వచ్చారు.. ఆయనే ఇళయదళపతి విజయ్. ఈ పార్టీ పేరును ఎన్నికల‌సంఘంలో రిజిస్ట్రేషన్ చేయించినట్టు కూడా వార్తలు వచ్చాయి.. విజయ్ పీపుల్స్ మూమెంట్ పార్టీగా రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా సమాచారం. ‘ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కల్ ఇయ్యకం’ గా విజయ్ పార్టీ పేరు ఉండనుంది అని.. విజయ్ పీపుల్స్ ఉద్యమంగా వున్న సంస్థను పార్టీగా మారుస్తారని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇస్తూ రాజనీకాంత్ వెనక్కి తగ్గడంతో.. హీరో విజయ్ ఎంట్రీ ఖాయమని చర్చ సాగుతోంది.. ఇప్పటికే తమిళనాడు సీఎం పళనిస్వాని కూడా కలిశారు విజయ్.. ఈ నెల 31న పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. జయలలిత సమాధి దగ్గర తన పార్టీ పేరును ప్రకటించేందుకు విజయ్ సన్నాహాలు చేసుకుంటున్నారని తమిళ పొలిటికల్ సర్కిల్‌లో చర్చ సాగుతోంది.. రజనీ పొలిటికల్ ఎంట్రీ.. అళగిరి పార్టీతో డీఎంకే ఓటు బ్యాంక్ చీల్చేలా స్కెచ్ వేశారని టాక్ నడగా.. రజనీ వెనక్కి తగ్గడంతో ఇప్పుడు హీరో విజయ్ పేరు తెరపైకి వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related posts