telugu navyamedia
రాజకీయ

రాజ్యసభలో ఘనంగా వీడ్కోలు : వెంకయ్య భావోద్వేగం

మీ పదవీ కాలం ముగియవచ్చు గానీ మీ జీవితం, మీ అనుభవాలు రాబోయే కాలంలో దేశానికి మార్గదర్శకంగా ఉంటాయ‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. వెంకయ్య నాయుడు మార్గదర్శనంలో సుదీర్ఘకాలం సన్నిహితంగా పనిచేసే అవకాశం తనకు లభించడం గర్వంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య పదవీ కాలం 10న ముగియనుంది.

Rajya Sabha bids farewell to Vice President M Venkaiah Naidu on completion  of his term - Pragativadi

ఉపరాష్ట్రపతిగా బుధవారం పదవీవిరమణ చేయనున్న వెంకయ్యనాయుడుకు సోమవారం రాజ్యసభలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు.మోదీ ప్రసంగిస్తూ.ధర్మం, కర్తవ్య నిర్వహణే లక్ష్యంగా ఆయన తన భావితరాలకు మార్గదర్శనం చేశారని ప్రశంసించారు. దేశం కోసం, పార్లమెంటరీ వ్యవస్థ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషికి ప్రధానమంత్రిగా పార్లమెంట్‌ సభ్యులందరి తరఫునా ధన్యవాదాలు చెబుతున్నానని ప్రకటించారు.

People will keep calling Venkaiah Naidu for something or other, says PM Modi - The Hindu

ఆయన మార్గదర్శనంలో ఎన్నో బిల్లులను విజయవంతంగా ఆమోదించారని చెప్పారు.ర్చల ద్వారా ఏ సమస్యకైనా పరిష్కారం అనే విషయంలో వెంకయ్య ఆదర్శంగా, స్ఫూర్తిదాయకంగా నిలిచార ని కొనియాడారు. వెంకయ్య నెలకొల్పిన ప్రమాణాల్లో ప్రజాస్వామ్య పరిపక్వతను చూశానన్నారు. వెంకయ్య చమత్కార సంభాషణలను పలు సందర్భాల్లో మోదీ గుర్తు చేసుకున్నారు.

ఇదిలా ఉంటే.. వెంకయ్య వ్యవసాయ కుటుంబంలో జన్మించారని, ఏడాది వయసులో తల్లిని కోల్పోయారని టీఎంసీ నేత డెరెక్‌ ఓబ్రియన్‌ చెప్పారు. ఈ సందర్భంగా వెంకయ్య తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. ఒక నిమిషం పాటు చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకున్నారు.

వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మీరు 2020 సెప్టెంబరు 20న రాజ్యసభలో సాగు బిల్లులు ఆమోదం పొందిన రోజు సభాపతి స్థానంలో లేరు. అందుకు కారణాన్ని ఆత్మకథలో పేర్కొనాలి’ అని ఒబ్రెయిన్‌ అన్నారు.

 ఒత్తిడిలోనూ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించారని ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే వెంకయ్యను ప్రశంసించారు. సభ గౌరవాన్ని వెంకయ్య పెంచారని డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ చెప్పారు.వెంకయ్య పదవీవిరమణ తర్వాత సభలో ఎలాంటి వాతావరణం ఉంటుందో మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు .

Members laud M Venkaiah Naidu's role as RS Chairman, urge him to write  autobiography

వెంకయ్యనాయుడు సభను నిష్పక్షపాతంగా నడిపించారని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ కొనయాడారు. ఈ ఐదేళ్ల కాలంలో తీసుకున్న నిర్ణయాలన్నీ సువర్ణాక్షరాలతో లిఖించబడుతాయని చెప్పారు. ఈ రోజులను తామంతా ఎప్పటికీ మరచిపోలే మన్నారు. ఈ ఐదేళ్లు సభ గౌరవాన్ని మరింత పెంచారని కొనియాడారు.

వెంకయ్య నాయుడి రాజకీయ జీవితం, అందించిన సేవలు అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని రాజ్యసభ ఎంపీలు పేర్కొన్నారు. ఆయన గురించి భవిష్యత్తు తరాలు తెలుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే ఆత్మకథ(ఆటోబయోగ్రఫీ) రాయాలని వెంకయ్యకు విజ్ఞప్తి చేశారు.

రాజ్యసభ చైర్మన్‌ హోదాలో జూనియర్లు, సీనియర్లు అనే తేడా లేకుండా సభ్యులందరినీ సమానంగా చూశారని, వివక్ష ప్రదర్శించలేదని పలువురు ఎంపీలు కొనియాడారు.

Related posts