telugu navyamedia
సినిమా వార్తలు

మీకు ఏం కావాలో ఒక్క వర్డ్‏లో చెప్పండి..

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టక్ జగదీష్.  త‌న‌ హిట్ దర్శకుడు శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఇంకొన్ని రోజుల్లో నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కి రెడీగా ఉంది.

Tuck Jagadish Teaser- Nani, Ritu Varma, Jagapathi Babu

ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. అయితే నాని టక్ జగదీష్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడంతో.. టక్ జగదీష్ మూవీని థియేటర్లలో కాకుండా.. అమెజాన్ ప్రైమ్‏లో విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించడంతో నాని ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.

థియేటర్లలో చూసిన ఫీల్ ఓటీటీలో రాదంటూ కొందరు కామెంట్స్ చేయగా.. ప్రస్తుతం పరిస్థితులలో నాని తీసుకున్న నిర్ణయం సరైనదే అంటూ మరికొందరు ఈ హీరోకు మద్దతుగా నిలిచారు. ఈ సినిమా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‏లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ట్రైలర్‏ను విడుదల చేయనున్నారు.

ఈ నేప‌థ్యంలో నాని తన అభిమానుల కోసం అదిరిపోయే సర్‎ప్రైజ్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా నాని తన ఇన్‏స్టా స్టోరీలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో నాని మాట్లాడుతూ.. ఫ్యామిలీ లో భాగం అవ్వడానికి ఇది సమయం అంటూ ..మీరందరూ టక్ జగదీష్ ట్రైలర్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు. అందుకే మీకోసం చిన్న సర్‏ప్రైజ్.. టక్ జగదీష్ ట్రైలర్‏లో మీరు ఏం ఎక్స్‏పెక్ట్ చేస్తున్నారో ఒక్క వర్డ్‏లో కామెంట్స్ చేయండి అంటూ చెప్పుకొచ్చాడు నాని.. వాటిని చదవడానికి తను వెయిట్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ‘

విలేకరి ప్రశ్నకు నాని కౌంటర్

నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ‘టక్ జగదీష్’కు థమన్ సంగీతం అందించ‌గా.. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హారిష్ పెద్ది నిర్మిస్తున్నారు. కాగా ట్రైలర్ ను సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను కూడా రిలీజ్‌ చేసింది.

Related posts