telugu navyamedia
ఆరోగ్యం

కరోనాలో మరో వేరియంట్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు..!

క‌రోనా మ‌హ‌మ్మారితో యావత్ ప్రపంచమే గజగజలాడింది. ప్ర‌తిరోజూ ల‌క్ష‌ల సంఖ్య‌లో కరోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ వేగవంతం చేసినా రోజువారీ కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న చెందుతున్నాయి. కరోనా మ‌హ‌మ్మారిని ఎలా క‌ట్ట‌డి చేయాలో తెలియ‌క ఆందోళ‌న చెందుతున్నారు.

కరోనా ఇప్పుడు రకరకాల వేరియంట్లతో భయపెడుతోంది. ఇప్పటికే డెల్టా వేరియంట్లతో కొన్ని దేశాల్లో విజృంభణ కొనసాగుతోంది. ఇప్పుడు కొత్తగా మరో వేరియంట్ ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతోంది. సి 1.2
వేరియంట్‌గా పిలుస్తున్న కరోనా కొత్తరూపం తొలిసారి దక్షిణాఫ్రికాలో బయటపడింది. సి 1 కంటే ఈ సీ 1.2 వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని, ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ల‌ను త‌ట్టుకొని నిల‌బ‌డే విధంగా జ‌న్యుమార్పిడి జ‌రుగుతుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

ఇక ఈ సీ 1.2 వేరియంట్‌ను చైనా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మారిషస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్ దేశాల్లోనూ గుర్తించారు. బీటా, డెల్టా వేరియంట్ల మాదిరిగా వీటి మ్యూటేషన్‌లో పెరుగుదల కనిపిస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. యాంటీబాడీలను తప్పించుకునే గుణం సీ1.2లో గుర్తించినట్లు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నుగొన్న వేరియంట్ల కంటే ఈ సీ 1.2 వేరియంట్ 41.8 శాతంగా ఉన్న‌ట్టు ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

Related posts