telugu navyamedia
ఆరోగ్యం

రోజు నడక ఆరోగ్యానికి డోకాలేదిక..

వ్యాయామం అనేది శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం చేసే శారీరక ప్రక్రియ. అధిక బరువు తగ్గించుకోవడానికి, మానసిక ఉల్లాసం కూడా పెరుగుతుంది. వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం వలన మన శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుంది. గుండెకు సంబంధించిన వ్యాధులు, స్థూలకాయం, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. మానసిక వ్యాధులను సైతం దూరం చేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని కలుగచేస్తుంది. తద్వారా మానసిక ఒత్తిడుల నుంచి కూడా దూరం చేస్తుంది. బాల్యంలోనే వచ్చే ఊబకాయం లాంటి సమస్యలకు వ్యాయామం చక్కటి పరిష్కారం. అయితే ఇందుకోసం జిమ్‌లలో అన్ని రకాల ఎక్విప్‌మెంట్స్‌తో కుస్తీలు పట్టాల్సిన అవసరం లేదు. గంటల కొద్దీ సమయాన్ని గడపాల్సిన అవసరం లేదు. అలానే వ్యాయామం కోసం ఆఫీస్ కు ఆలస్యంగా వెళ్ళక్కర్లేదు. దీనికోసం తక్కువ సమయాన్ని కేటాయించి మంచి ఆరోగ్యం పొందవచ్చు.

*రోజూ ఉదయం సాయంత్రం అరగంట నడక ఆరోగ్యానికి చాలామంచిది.
*యోగా, చిన్నచిన్న వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోండి.
*వారంలో మూడు రోజులు యోగా చేసే అలవాటు ఒత్తిడిని దూరం చేస్తుంది.
*రోజూ చేసే అరగంట వ్యాయామం వల్ల కండరాలన్నీ పనిచేసి, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
*బరువు తగ్గడానికి మార్నింగ్ వర్కౌట్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
* ఉదయం వ్యాయామం వల్ల మొత్తం శరీరంలో బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తుంది. హార్ట్ రేట్ పెంచుతుంది మరియు రక్తప్రవాహాన్ని కండరాలకు చురుకుగా అంధిస్తుంది.
* కొన్ని పరిశోధనల ప్రకారం సాయంత్రంలో వ్యాయామం చేసే వారికంటే, ఉదయం చేసే వ్యాయామం వల్ల ప్రశాంతమైన నిద్రను పొందుతారని నిరూపించబడింది. అందుకు ప్రధాన కారణం కండరాలు విశ్రాంతి పొందడానికి మరియు సాధారణ స్థితికి చేరడానికి కొంత సమయం తీసుకుంటుంది.
* పోషకాహరం తీసుకుంటూ తగినంత నీటిని తీసుకోవాలి.
 *ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించాలి

Related posts