telugu navyamedia
ఆరోగ్యం

అలర్జీలకు … మంచి ఔషధంగా.. యాపిల్..

tips to overcome allergies
యాపిల్ తింటేనే ఆరోగమే కాదు, దానితో ఇతర ప్రయోజనాలు కూడా ఉండాయంటున్నారు వైద్యులు. వాతావరణంలోని మార్పుల కారణంగా, దుమ్ము, ధూళీ, వివిధ రకాల ఫ్యాబ్రిక్స్ దుస్తులను ధరించడం మూలాన, అలానే కొన్ని మందులు, మాత్రలు వాడడంతో అలర్జీ వస్తుందని వైద్యులు చెపుతున్నారు. చర్మానికి అలర్జీ రకరకాలుగా వస్తుంది. 
ఈ అలర్జీ కారణంగా చర్మం రంగు మారడం, దద్దుర్లు రావడం, దురద పుట్టడం, మంటగా అనిపించడం వంటివి జరుగుతుంటాయి. ఇలా జరిగినప్పుడు ఇంట్లోనే కొన్ని చిట్కాలతో అలర్జీని పారద్రోలవచ్చంటున్నారు వైద్యులు. అలర్జీ వచ్చినచోట తేనె రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది. మీరు వాడే తేనెలో ఎలాంటి కల్తీ లేకుండా ఉండేలా చూసుకోవాలంటున్నారు వైద్యులు.
యాపిల్ మధ్యలో కట్ చేసి, ఒక భాగంపై వెనిగర్ వేసి దురదలున్నచోట రాస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది. అలానే వెనిగర్‌ను నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని గాజుగుడ్డపై వేసి దురద ఉన్న ప్రదేశంలో రాస్తే దురద మటుమాయం అంటున్నారు వైద్యులు. చర్మంపై ర్యాషెస్ వచ్చినప్పుడు ఒకటి లేదా రెండు కప్పులు గ్రీన్ టీలో తేనె కలుపుకుని సేవించాలి. గ్రీన్ టీకి బదులుగా బ్లాక్ టీని కూడా వాడొచ్చంటున్నారు వైద్యులు.

Related posts